ఖలేజా కథ ఇదేనా !
రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకొని విడుదలకు సిద్ధమైన చిత్రం 'మహేష్ ఖలేజా'. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'అతడు' బిగ్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్‌పై మరోసారి అంచనాలు పెరిగాయి. ఇందులో మహేష్‌బాబు ఓ టాక్సీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు !
కథనం ఇలా సాగుతుందని ఇండిస్టీ సమాచారం...తనపనేంటో తాను చేసుకునే తత్వం హీరోది. ఇతరుల విషయంలో కలగజేసుకోవడమనే ప్రశ్నే లేదు. కుటుంబపెద్ద తాతయ్య. సాంప్రదాయల్ని పక్కాగా పాటించాలని బల్లగుద్ది వాదించే మనిషి. ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడు. వీరిది ఓ మామూలు మధ్య తరగతి కుటుంబం. ఇతని బతుకేదో ఇతడు బతుకుతుంటే సంఘవిద్రోహక శక్తులు ఇతన్ని డిస్ట్రబ్ చేస్తాయి. పరిస్థితులు సంఘర్షణకు దారితీస్తాయి. అనుకోని పరిస్థితుల్లో రాజస్తాన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అనూహ్యమైన దాడులు హీరోపై జరుగుతాయి. చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. స్ప్రహ నుంచి కోలుకునేసరికి ఓ గ్రామంలో ఉంటాడు. ఆ గ్రామస్తులే హీరోను కాపాడుతారు. అంతేగాక వారు తమను, తమ గ్రామాన్ని విద్రోహ శక్తుల నుండి కాపాడమని అతన్ని అడుగుతారు. ఇక ఆ తరువాత దుష్టసంహారం.
మహేష్‌బాబు తాజా చిత్రం 'మహేష్ ఖలేజా'. ఇందులో ఆయన టాక్సీడ్రైవర్‌గా నటిస్తున్నారు. అనుష్క హీరోయిన్. ఆడియో సికింద్రాబాద్‌లో విడుదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేష్‌బాబు నిర్మించారు. మహేష్ తనయుడు గౌతమ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, సి.కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. మహేష్ మాట్లాడుతూ...'మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆరు పాటలూ అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా 'సదాశివ..', 'పిలచే పెదవులపైన' సాంగ్స్ నా ట్విట్టర్‌లో పెట్టాను. ఆ పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పాటలు నాకు బాగా నచ్చాయి. అలాగే 'టాక్సీ' అనే ఇంట్రడక్షన్ సాంగ్ రెగ్యులర్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్‌కి భిన్నంగా మణిశర్మ చేశారు. 'భూమ్ శకనక' అనే పాట, 'సండేమండే' అనే పాట ట్రెండీగా వుంటాయి. 'మకతిక మాయా మశ్చింద్ర' అనే పాట సినిమాలో లాస్ట్‌సాంగ్. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
టోటల్‌గా త్రివిక్రమ్, మణిశర్మ కాంబినేషన్‌లో మంచి హిట్ మ్యూజిక్ వచ్చింది. సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుంది. మూడేళ్ళ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఆడియో రిలీజ్ అయిన ఈ రోజు నాకు బిగ్‌డే. ఆడియో ఆల్‌రెడీ స్టోర్స్‌లో ఉంది. అన్ని సెంటర్స్ నుండీ ఫ్యాన్స్ ఫోన్లు చేసి ఆడియో సూపర్‌హిట్ అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది' అన్నారు.
పాటలన్నీ చాలా బాగున్నాయని, పెద్ద హిట్ అవుతుందని నటి అనుష్క అన్నారు.
మణిశర్మ మాట్లాడుతూ...'మహేష్ కాంబినేషన్‌లో రాజకుమారుడు, మురారి, ఒక్కడు, పోకిరి చేశాం. అన్ని మ్యూజికల్ హిట్ట్సే అయ్యాయి. ఇదీ పెద్ద హిట్ అవుతుంది. ఇందులో 'సదాశివ' పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ...'అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తున్నాం. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. మణిశర్మ అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు' అని అన్నారు. కెమెరా: భట్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్.